విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేము.. వాళ్లిద్దరి పాత్రలు వేరు: బ్రాడ్ హాగ్

ABN , First Publish Date - 2020-06-04T21:08:23+05:30 IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ‌ల మధ్య పోలిక లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో

విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేము.. వాళ్లిద్దరి పాత్రలు వేరు: బ్రాడ్ హాగ్

న్యూఢిల్లీ: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ‌ల మధ్య పోలిక లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. భారీ స్కోర్‌ల ఛేజింగ్‌లో విరాట్ ఆడిన విధంగా రోహిత్ బ్యాటింగ్ చేయలేడని అన్నారు. ‘‘ఇండియా భారీ స్కోర్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అత్యంత స్థిరంగా బ్యాటింగ్ చేస్తాడు. అతను పటిష్టంగా నిలబడి మ్యాచ్‌ను గెలిపిస్తాడు. విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేము. ఎందుకంటే వారిద్దరి పాత్రలు వేరు. కొత్త బంతి బౌలర్ల బౌలింగ్‌లో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటం రోహిత్ పాత్ర. మరోవైపు మ్యాచ్ ఆసాంతం నిలబడి మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడమే కోహ్లీ పాత్ర’’ అని హాగ్ తెలిపారు. 

Updated Date - 2020-06-04T21:08:23+05:30 IST