పోలీసులపై బ్రయాంట్‌ భార్య దావా!

ABN , First Publish Date - 2020-05-10T10:13:48+05:30 IST

అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయంట్‌, అతడి కూతురు ఈ ఏడాది ఆరంభంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే...

పోలీసులపై బ్రయాంట్‌ భార్య దావా!

లాస్‌ ఏంజిల్స్‌: అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయంట్‌, అతడి కూతురు ఈ ఏడాది ఆరంభంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, హెలికాప్టర్‌ కూలిన ప్రదేశంలో లాస్‌ఏంజిల్స్‌ కౌంటీ పోలీసులు కొన్ని ఫొటోలు తీసి ఇతరులకు షేర్‌ చేయడంపై బ్రయాంట్‌ భార్య వెనెస్సా ఇప్పుడు కోర్టులో కేసువేశారు. ఎటువంటి అధికారం లేకపోయినా 8 మంది పోలీసులు.. మరణించిన తన భర్త, పిల్లలు, కోచ్‌లను సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడంపై వెనెస్సా ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఎవరూ ఇలా వ్యవహరించకుండా ఉండేందుకే కోర్టులో కేసు ఫైల్‌ చేసినట్టు బ్రయాంట్‌ కుటుంబ ప్రతినిధి తెలిపారు. 

Updated Date - 2020-05-10T10:13:48+05:30 IST