సంకల్ప బలంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2020-06-11T09:36:03+05:30 IST

బాక్సింగ్‌ పురుషులే ఆడాల్సిన క్రీడ కాదని ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ తెలిపింది. బాక్సింగ్‌లో మహిళలు కూడా విశేషంగా రాణిస్తున్నారని ...

సంకల్ప బలంతో ముందుకు సాగాలి

న్యూఢిల్లీ: బాక్సింగ్‌ పురుషులే ఆడాల్సిన క్రీడ కాదని ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ తెలిపింది. బాక్సింగ్‌లో మహిళలు కూడా విశేషంగా రాణిస్తున్నారని ఒలింపిక్‌ కాంస్య పతక విజేత మేరీ చెప్పింది. బుధవారం నిర్వహించిన ‘లెజెండ్స్‌’ అనే లైవ్‌ కార్యక్రమంలో సుమారు 25 వేల మంది విద్యార్థులతో మేరీ తన జీవిత విశేషాలను పంచుకొంది. తాను విజయవంతమైన బాక్సర్‌గా ఎదగడానికి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. ‘జీవితంలో చాలా అవరోధాలు ఉంటాయి. అయితే కష్టపడి పనిచేస్తూ లక్ష్యం వైపు పయనించాలి. కఠిన పరిస్థితులు ఎదురైనా అధైర్యపడవద్దు. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఏకాగ్రత, క్రమశిక్షణ, సంకల్ప బలంతో ముందుకు సాగాలి’ అని మేరీ సూచించింది. 


Updated Date - 2020-06-11T09:36:03+05:30 IST