100 శతకాలను దాటేది విరాటే..

ABN , First Publish Date - 2020-04-26T10:15:37+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సాధించిన రికార్డులకు కొదవేలేదు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్‌ చేసిన వంద శతకాల ఫీట్‌ ..

100 శతకాలను దాటేది విరాటే..

 సచిన్‌ రికార్డుపై బ్రెట్‌ లీ

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సాధించిన రికార్డులకు కొదవేలేదు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్‌ చేసిన వంద శతకాల ఫీట్‌ చెక్కుచెదరకుండా ఉంది. అయితే భవిష్యత్‌లో ఈ అరుదైన మైలురాయిని అధిగమించే సత్తా భారత కెప్టెన్‌  విరాట్‌ కోహ్లీకి ఉందని ఆస్ర్టేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ భావిస్తున్నాడు.  ‘అద్భుత నైపుణ్యం, ఫిట్‌నెస్‌, మానసిక దృఢత్వం కలగలిసిన విరాట్‌ కోహ్లీ వచ్చే 7-8 ఏళ్లలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయితే అతను అప్పటివరకు ఇదే ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది’ అని బ్రెట్‌ లీ తెలిపాడు.

Updated Date - 2020-04-26T10:15:37+05:30 IST