వచ్చేస్తున్నా..
ABN , First Publish Date - 2020-05-13T09:59:39+05:30 IST
మాజీ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగనున్నాడు. కరోనా భాధితులను ఆదుకోవడం కోసం 53 ఏళ్ల మైక్ మళ్లీ రింగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. చారిటీ మ్యాచ్‌ల్లో....

చారిటీ బౌట్ ఆడనున్న టైసన్
లాస్‌ఏంజిల్స్: మాజీ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగనున్నాడు. కరోనా భాధితులను ఆదుకోవడం కోసం 53 ఏళ్ల మైక్ మళ్లీ రింగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. చారిటీ మ్యాచ్‌ల్లో ఆడి విరాళాలు సేకరించాలనుకుంటున్నానని టైసన్ తెలిపాడు. టైసన్ ప్రత్యర్థులుగా బిల్ విలియమ్స్ (న్యూజిలాండ్), పాల్ గాలెన్ (ఆస్ట్రేలియా)లో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. 2005లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన టైసన్.. అప్పటి నుంచి మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టలేదు. కరోనా బాధితుల సహాయార్థం విరాళాలు అందించే వారి కోసం కూడా మైక్.. తాను ఆటోగ్రాఫ్ చేసిన బాక్సింగ్ గ్లౌజ్‌లను బహుమతిగా అందించనున్నాడు. కనీసం రూ. 2 వేలు విరాళంగా ఇచ్చే వారి నుంచి లాటరీగా గ్లౌజ్‌ల విజేతలను ఎంపిక చేయనున్నాడు.