రూర్కెలాలో అతిపెద్ద హాకీ స్టేడియం

ABN , First Publish Date - 2020-12-25T09:21:02+05:30 IST

దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని నిర్మించేందుకు ఒడిశా ప్రభుత్వం నడుం బిగించింది. రూర్కెలాలోని బిజు పట్నాయక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నికల్‌ క్యాంప్‌సలో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ స్టేడియాన్ని...

రూర్కెలాలో అతిపెద్ద హాకీ స్టేడియం

భువనేశ్వర్‌: దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని నిర్మించేందుకు ఒడిశా ప్రభుత్వం నడుం బిగించింది. రూర్కెలాలోని బిజు పట్నాయక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నికల్‌ క్యాంప్‌సలో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్టు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురువారం ప్రకటించారు. 20 వేల సీటింగ్‌ సామర్థ్యంతో రూపొందిస్తున్న ఈ స్టేడియం 2023 హాకీ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ’2023 వరల్డ్‌కప్‌ పోటీలను రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌తో పాటు సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలాలో నిర్మిస్తున్న మైదానంలో కూడా నిర్వహిస్తాం. ఈ స్టేడియాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ హాకీ మైదానాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని నవీన్‌ చెప్పారు.


Updated Date - 2020-12-25T09:21:02+05:30 IST