ఐపీఎల్‌కు భజ్జీకూడా దూరం?

ABN , First Publish Date - 2020-09-01T09:53:00+05:30 IST

వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కూడా ఈ సారి ఐపీఎల్‌కు దూరం కానున్నాడా? పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తోంది.

ఐపీఎల్‌కు భజ్జీకూడా దూరం?

న్యూఢిల్లీ: వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కూడా ఈ సారి ఐపీఎల్‌కు దూరం కానున్నాడా? పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. వాస్తవంగా అతడు మంగళవారం దుబాయ్‌ వెళ్లి చెన్నై జట్టుతో కలవాల్సి ఉంది. కానీ జట్టులో ఇద్దరు క్రికెటర్లు సహా సహాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడడం, సురేశ్‌ రైనా హఠాత్తుగా స్వదేశం తిరిగి రావడంతో హర్భజన్‌ సింగ్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. దాంతో దుబాయ్‌ వెళ్లడం కొద్దిరోజులు వాయిదా వేసుకోవడమా లేదంటే అసలు  ఐపీఎల్‌కే దూరం కావడమా..అనే ఆలోచనలో భజ్జీ ఉన్నట్టు అతడి సన్నిహితులు వెల్లడించారు. 

Updated Date - 2020-09-01T09:53:00+05:30 IST