‘రూ. 800 కోట్ల’ కేసు గెలిచిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-07-15T08:52:13+05:30 IST

ఐపీఎల్‌ మీడియా హక్కుల రద్దుకు సంబంధించిన సుదీర్ఘ పోరాటంలో బీసీసీఐకి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ, వరల్డ్‌ స్పోర్ట్స్‌ ...

‘రూ. 800 కోట్ల’  కేసు గెలిచిన బీసీసీఐ

ఐపీఎల్‌ మీడియా హక్కుల రద్దుకు సంబంధించిన సుదీర్ఘ పోరాటంలో బీసీసీఐకి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ, వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ (డబ్ల్యూఎ్‌సజీ) అధికారులు.. బోర్డును మోసం చేసేందుకు పన్నిన కుట్ర నిరూపితమైందని బీసీసీఐ న్యాయవాది రఘురామన్‌ తెలిపారు. అనేక అవకతవకల కారణంగా విదేశాల్లో ఐపీఎల్‌ ప్రసారహక్కులకు సంబంధించి డబ్ల్యూఎ్‌సజీతో చేసుకున్న ఒప్పందాన్ని బీసీసీఐ 2010, జూన్‌ 28న రద్దు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు జడ్జి (రిటైర్డ్‌) సుజాత మనోహర్‌ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌.. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో వారి ఖాతాలోని రూ.800 కోట్ల రూపాయలను పొందేందుకు బీసీసీఐకు అనుమతి లభించింది.

Updated Date - 2020-07-15T08:52:13+05:30 IST