యువీ రీఎంట్రీకి బీసీసీఐ నో
ABN , First Publish Date - 2020-12-30T07:00:30+05:30 IST
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీల్లో ఆడాలనుకున్న యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ

న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తిరిగి దేశవాళీల్లో ఆడాలనుకున్న యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. యువరాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువరాజ్.. ఆ తర్వాత విదేశీ లీగ్‌లలో ఆడాడు.
గ్లోబల్ టీ20 కెనడా, టీ10 లీగ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. విదేశీ లీగ్‌లలో ఆడిన భారత క్రికెటర్ ఐపీఎల్, దేశవాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్ పునరాగమనానికి బోర్డు అంగీకరించలేదు.