ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-10-27T03:59:26+05:30 IST

ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20, టెస్ట్ సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత జట్టు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20, టెస్ట్ సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత జట్టు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. 


ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు ఇదే: 

కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీషా, కేఎల్‌.రాహుల్‌, పుజారా, రహానే, హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్ సాహా, పంత్, బుమ్రా, షమీ, ఉమేష్‌, షైనీ, కుల్‌దీప్‌, జడేజా, అశ్విన్‌, సిరాజ్ 


ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:

కోహ్లీ(కెప్టెన్‌), ధవన్‌, మయాంక్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, మనీష్‌పాండే, హార్దిక్‌పాండ్యా, సంజూ శామ్సన్, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, బుమ్రా, షమీ, షైనీ, దీపక్‌చాహర్‌, వరుణ్‌చక్రవర్తి


ఇక కాలుకు గాయం కావడంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను బీసీసీఐ ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయలేదు. వైద్య బృందం రోహిత్ శర్మ పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటుందని బీసీసీఊ పేర్కొంది. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది. అంతేకాకుండా వన్డే, టీ20 సిరీస్‌లకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ ఇషాంత శర్మ కూడా పక్కటెముక గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటు ఇషాంత్ శర్మ పేరును కూడా బీసీసీఐ ప్రకటించలేదు.

Updated Date - 2020-10-27T03:59:26+05:30 IST