బీసీసీఐ నిరీక్షణ ఫలించేనా?

ABN , First Publish Date - 2020-07-20T09:01:59+05:30 IST

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ఎదురుచూపులు ఫలిస్తాయా? బోర్డు ఊహిస్తున్నట్టుగా టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడి ఐపీఎల్‌కు మార్గం ...

బీసీసీఐ నిరీక్షణ ఫలించేనా?

టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై ఆశలు

నేడు తేల్చనున్న ఐసీసీ

దుబాయ్‌: భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ఎదురుచూపులు ఫలిస్తాయా? బోర్డు ఊహిస్తున్నట్టుగా టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడి ఐపీఎల్‌కు మార్గం సులువవుతుందా? ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది. ఈ మెగా టోర్నీ భవితవ్యం నిర్ణయించేందుకు ఐసీసీ ఆన్‌లైన్‌లో సోమవారం సమావేశం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా వరల్డ్‌కప్‌ జరగాలి. కానీ, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే స్పష్టం చేసింది. అధికారికంగా టీ20 కప్‌ వాయిదా ప్రకటన వెలువడితే.. ఐపీఎల్‌ సన్నాహకాలను ముమ్మరం చేసేందుకు బీసీసీఐ ఆత్రుతగా ఎదురు చూస్తుంది. వరల్డ్‌కప్‌ విండోలోనే ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, ఈ సమావేశంలోనే ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక అంశం కూడా చర్చకు రానుంది.

Updated Date - 2020-07-20T09:01:59+05:30 IST