ఖమ్మంలో రూ.కోటితో బాస్కెట్‌బాల్‌ స్టేడియం

ABN , First Publish Date - 2020-03-02T10:07:56+05:30 IST

స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌లో నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియా న్ని పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఆదివారం

ఖమ్మంలో రూ.కోటితో బాస్కెట్‌బాల్‌ స్టేడియం

ఖమ్మం (ఆంధ్రజ్యోతి): స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌లో నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియా న్ని  పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. రూ.కోటి రూపాయల వ్యయంతో  ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు దీటుగా ఇక్కడ బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ కోర్టును నిర్మించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరో వైపు   స్టేడియం ముఖద్వారంపై చిత్రించిన అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయాంట్‌ త్రీడీ చిత్రం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Updated Date - 2020-03-02T10:07:56+05:30 IST