కోహ్లీ సాధన చూసి.. సిగ్గుపడ్డా!
ABN , First Publish Date - 2020-06-03T09:09:32+05:30 IST
విరాట్ కోహ్లీ ఫిట్నెస్, సాధన చేస్తున్న తీరును చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్ వన్డే టీమ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. దాదాపుగా ఇద్దరం...
బంగ్లా వన్డే కెప్టెన్ తమీమ్
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఫిట్నెస్, సాధన చేస్తున్న తీరును చూసి తాను సిగ్గుపడ్డానని బంగ్లాదేశ్ వన్డే టీమ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. దాదాపుగా ఇద్దరం ఒకే వయసు వాళ్లమైనా.. కోహ్లీ కష్టపడుతున్నట్టు తాను ఎందుకు చేయలేకపోతున్నానో అని అనిపించిందని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో లైవ్‌చాట్‌లో తమీమ్ చెప్పాడు. ‘విరాట్ పరుగెత్తే తీరు ఎంతో ఆశ్చర్యపరిచింది. ఫిట్నెస్ కోసం అతడు పడుతున్న కష్టంలో కనీసం సగం కూడా పడలేక పోతున్నానే? అని సిగ్గుపడ్డాన’ని తమీమ్ చెప్పాడు.