బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-13T21:22:26+05:30 IST

బంగ్లాదేశ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, జట్టు డెవలప్‌మెంట్ కోచ్ అషికుర్ రహ్మన్‌కు కరోనా వైరస్ సోకింది. బీసీబీ మీడియా కమిటీ హెడ్ మహ్మద్ జలాల్ యునుస్

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, జట్టు డెవలప్‌మెంట్ కోచ్ అషికుర్ రహ్మన్‌కు కరోనా వైరస్ సోకింది. బీసీబీ మీడియా కమిటీ హెడ్ మహ్మద్ జలాల్ యునుస్ రహ్మన్ ప్రస్తుతం ఢాకాలోని ముగ్దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తనకు కరోనా సోకిన విషయాన్ని రహ్మన్ స్వయంగా వెల్లడించారు. 


ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘తాజాగా వచ్చిన రిపోర్టుల్లో నాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ జరిగింది. నాకు ముందు ఏం జరిగిందో అర్థం కాలేదు. టాన్సిల్ వాపు వచ్చిందని తొలుత అనుకున్నాను. ముందు గొంతులో నొప్పి వచ్చింది.. ఆ తర్వాత జ్వరం కూడా వచ్చింది. ఒక ఛాతిలో నొప్పి కూడా రావడంతో.. వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లాను’’ అని ఆయన పేర్కొన్నారు. 


బంగ్లాదేశ్ తరఫున 2002లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన రహ్మన్ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 36, లిస్ట్‌-ఏలో 21 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ మహిళ క్రికెట్ జట్టుకు కూడా గతంలో ఆయన అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. 

Read more