నేడు డబుల్‌ ధమాకా

ABN , First Publish Date - 2020-10-03T09:00:29+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తొలిసారిగా అభిమానులకు డబుల్‌ ధమాకా లభించనుంది. 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం ఒకే రోజు రెండు ...

నేడు డబుల్‌ ధమాకా

అబుదాబి: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తొలిసారిగా అభిమానులకు డబుల్‌ ధమాకా లభించనుంది. 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. తొలుత మధ్యాహ్నం 3.30 నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య.. ఆ తర్వాత షార్జాలో రాత్రి 7.30 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ జరుగుతుంది. వరుస విజయాలతో ఉన్న రాజస్థాన్‌కు తమ చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఓటమి ఎదురైంది. తమ వ్యూహాలకు పదును పెడుతూ తిరిగి గెలుపు బాటలో పయనించాలని ఆర్‌ఆర్‌ చూస్తోంది. అటు ఆర్‌సీబీకి డెత్‌ బౌలింగ్‌ ఇబ్బందికరంగా మారింది. పంజాబ్‌, ముంబైలపై నాలుగేసి ఓవర్లలో మొత్తం 163 పరుగులు సమర్పించుకుంది. రాజస్థాన్‌లో యశస్వి జైస్వాల్‌ తిరిగి ఆడే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌సీబీలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. ఇక షార్జాలో రాత్రి జరిగే మ్యాచ్‌లో మళ్లీ పరుగుల వరద చూడవచ్చు. ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ.. గెలుపు జోష్‌లో కోల్‌కతా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాయి. అయితే ఈ చిన్న మైదానంలో రస్సెల్‌ను అడ్డుకోకపోతే ఢిల్లీకి చుక్కలే.


Updated Date - 2020-10-03T09:00:29+05:30 IST