‘బాల్ ట్యాంపరింగ్’ను అనుమతిద్దామా?
ABN , First Publish Date - 2020-04-25T09:54:35+05:30 IST
కొవిడ్-19 కారణంగా మున్ముందు జరగబోయే క్రికెట్ సిరీ్‌సల్లో బౌలర్లు బంతికి ఉమ్మిని పూయడం ప్రమాదకరమనే చర్చ అంతటా...

ఐసీసీ ఆలోచన
న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా మున్ముందు జరగబోయే క్రికెట్ సిరీ్‌సల్లో బౌలర్లు బంతికి ఉమ్మిని పూయడం ప్రమాదకరమనే చర్చ అంతటా సాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. అందుకే ఇక నుంచి బంతి మెరుపు కోసం ఉమ్మిని కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. అయితే, దీన్ని అంపైర్ల సమక్షంలోనే చేయాలన్న నిబంధన కూడా పెట్టాలని ఐసీసీ భావిస్తోంది. గతంలో బంతికి ఉమ్మిని కాకుండా మరే పదార్థాన్ని ఉపయోగించినా బాల్ ట్యాంపరింగ్‌గా పరిగణించి శిక్షించేవారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా వార్నర్, స్మిత్‌ల సూచన మేరకు బాన్‌క్రా్‌ఫ్ట శాండ్‌పేపర్‌తో బంతికి మెరుపు తెచ్చేందుకు ప్రయత్నించిన ఉదంతం విదితమే. అయితే, ఇప్పుడు క్రికెట్ ముందుకెళ్లాలంటే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భావిస్తోంది. ఐసీసీ మెడికల్ కమిటీ కూడా ఇక నుంచి బంతికి ఉమ్మిని పూయడం ఏమాత్రం మంచిది కాదని గురువారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టం చేసింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో బంతి మెరుపు కోసం బౌలర్లు తరచూ తమ ఉమ్మిని పూస్తుంటారు. ఇలా అయితే, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలమని వారు భావిస్తుంటారు.