అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-07-08T08:07:04+05:30 IST

భారత అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన బహదూర్‌ సింగ్‌.. తన పదవికి రాజీనామా చేశాడు. 74 ఏళ్ల సింగ్‌ కాంట్రాక్ట్‌ గత నెల ...

అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌  రాజీనామా

న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన బహదూర్‌ సింగ్‌.. తన పదవికి రాజీనామా చేశాడు. 74 ఏళ్ల సింగ్‌ కాంట్రాక్ట్‌ గత నెల 30తో ముగిసింది. అయితే, వయసు నిబంధనల రీత్యా అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. దీంతో అతను తన పదవి నుంచి వైదొలగక తప్పలేదు. 1995 ఫిబ్రవరిలో కోచ్‌గా నియమితుడైన బహదూర్‌.. సుదీర్ఘ కాలం ఆ పోస్టులో పని చేసిన భారత కోచ్‌గా నిలిచాడు. అథ్లెట్‌గా 1978, 82 ఆసియా క్రీడల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో స్వర్ణాలు సాధించిన బహదూర్‌.. 1980  మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 1976లో అర్జున, 1998లో ద్రోణాచార్య అవార్డులను అందుకున్నాడు. ఇక.. కోచ్‌గా బహదూర్‌ హయాంలో భారత జట్టు ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో  2 స్వర్ణాలు సహా 12 పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో 8 స్వర్ణాలు, 9 రజతాలు సహా 20 పతకాలతో అదరగొట్టింది. 

Updated Date - 2020-07-08T08:07:04+05:30 IST