బ్యాడ్మింటన్‌ ర్యాంక్స్‌ ఫ్రీజ్‌!

ABN , First Publish Date - 2020-04-01T10:01:15+05:30 IST

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ను స్తంభింపజేయాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది. భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల ఎంట్రీ, సీడింగ్‌ కోసం మార్చి 17న విడుదల చేసిన తుది ర్యాంక్‌లను పరిగణనలోకి తీసుకోనున్నట్టు

బ్యాడ్మింటన్‌ ర్యాంక్స్‌ ఫ్రీజ్‌!

  • ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ను స్తంభింపజేయాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది.  భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల ఎంట్రీ, సీడింగ్‌ కోసం మార్చి 17న విడుదల చేసిన తుది ర్యాంక్‌లను పరిగణనలోకి తీసుకోనున్నట్టు బీడబ్ల్యూఎఫ్‌ మంగళవారం ప్రకటించింది. ‘తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌, జూనియర్‌ ర్యాంకింగ్స్‌ను ఫ్రీజ్‌ చేస్తున్నాం. చివరగా ఆడిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ తర్వాత ర్యాంక్‌లను పరిగణనలోకి తీసుకున్నాం. భవిష్యత్‌ టోర్నీల్లో ఈ ర్యాంక్‌ల ఆధారంగా సీడింగ్‌ నిర్ణయం తీసుకుంటామ’ని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. అయితే, ర్యాంక్‌లను స్తంభింపజేయడంపై సైనా నెహ్వాల్‌, సాయిప్రణీత్‌, కశ్యప్‌, ప్రణయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-04-01T10:01:15+05:30 IST