కోహ్లీకన్నా బాబర్ మంచి ఆటగాడు: రమీజ్ రజా

ABN , First Publish Date - 2020-04-14T23:19:33+05:30 IST

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంటేటర్ రమీజ్ రజా ప్రస్తుతం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై...

కోహ్లీకన్నా బాబర్ మంచి ఆటగాడు: రమీజ్ రజా

ఇస్లామాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రజా ఈ సారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై గురిపెట్టాడు. కోహ్లీకన్నా పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ ఆజమ్ గొప్ప ఆటగాడని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌‌ను అధిగమించే సత్తా కూడా బాబర్‌కు ఉందని రమీజ్ జోస్యం చెప్పాడు. ‘బాబర్ అద్భుతమైన ఆటగాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లతో పోల్చితే బాబర్ మరింత గొప్పగా ఆడగలడు. అందుకోసం అతడికి జట్టులో అనువైన వాతావరణం కల్పించాలి. కెప్టెన్‌గా, ఆటగాడిగా స్వేచ్ఛగా ఆడనివ్వాలి’ అని అన్నాడు. 


ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ మఫీజ్, షోయబ్ మాలిక్‌లపై ఇటీవల రమీజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికైనా వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలని, గౌరప్రదంగా తప్పుకోవాలని సూచించాడు. సీనియర్ ఆటగాళ్లుగా దేశానికి వారు ఎంతో సేవచేశారని, దానిని తాను గౌరవిస్తానని, కానీ ప్రస్తుతం వారు రిటైర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-04-14T23:19:33+05:30 IST