పాకిస్థాన్ కొత్త కెప్టెన్‌గా బాబర్ అజామ్.. టెస్ట్‌ల సారథ్య బాధ్యతలు అజర్‌కి
ABN , First Publish Date - 2020-05-13T22:37:09+05:30 IST
టీ-20 ఫార్మాట్‌తో పాటు, వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ అజామ్‌కి అప్పగిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గత 15 నెలలుగా

టీ-20 ఫార్మాట్‌తో పాటు, వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ అజామ్‌కి అప్పగిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గత 15 నెలలుగా అతను చేస్తున్న అద్భుత ప్రదర్శనకి గత ఏడాది టీ-20 జట్టుకు కెప్టెన్‌గా అతన్ని నియమించారు. మరోవైపు సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడటంతో.. టెస్ట్‌లను కెప్టెన్సీ చేసి అజర్ అలీకి అప్పగించారు.
‘‘కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తున్న అజర్ అలీ, బాబర్ అజామ్‌లను నా అభినందనలు. ఇది సరైన నిర్ణయం. వాళ్లకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని భావిస్తున్నాను. భవిష్యత్తులో వాళ్లు జట్టును బలపరిచేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుకుంటున్నాను’’ అని కోచ్, జాతీయ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ తెలిపారు.