వర్కవుట్లతో అజర్ బిజీ.. ప్రతి ఒక్కరూ ఇంటి పట్టునే ఉండాలంటూ వీడియో

ABN , First Publish Date - 2020-03-25T03:14:28+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ

వర్కవుట్లతో అజర్ బిజీ.. ప్రతి ఒక్కరూ ఇంటి పట్టునే ఉండాలంటూ వీడియో

హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసర సేవలు మినహా అన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన ప్రముఖులు పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమ్స్ ఆడడం వంటి పనులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా ఇలానే బిజీగా గడుపుతున్నాడు. క్లిష్టసమయంలో వర్కవుట్ ఎలా చేస్తున్నదీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందరూ ఇంటి పట్టునే క్షేమంగా ఉండాలని సూచించాడు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని కోరాడు. అందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని, లాక్‌డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశాడు. కరోనాపై పోరుకు అవసరమైన మానసిక బలాన్ని, ధైర్యాన్ని ఆ భగవంతుడు అందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నాడు. 

Read more