భారత మ్యూజియంలో అజర్‌ అలీ బ్యాట్‌

ABN , First Publish Date - 2020-05-09T10:13:11+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా సాయం అందించడానికి పాకిస్థాన్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అజర్‌ అలీ తన బ్యాట్‌, జెర్సీని ఆన్‌లైన్‌లో...

భారత మ్యూజియంలో అజర్‌ అలీ బ్యాట్‌

పుణె: కరోనాపై పోరులో భాగంగా సాయం అందించడానికి పాకిస్థాన్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అజర్‌ అలీ తన బ్యాట్‌, జెర్సీని ఆన్‌లైన్‌లో వేలం వేశాడు. బ్యాట్‌ను పుణెలోని ఓ క్రికెట్‌ మ్యూజియం రూ.10 లక్షలకు వేలంలో దక్కించుకొంది. అజర్‌ అలీ 2016లో వెస్టిండీస్‌తో టెస్టులో ఈ బ్యాట్‌తోనే ట్రిపుల్‌ సెంచరీ(302) బాదాడు. జెర్సీని పాకిస్థాన్‌కే చెందిన ఓ యువకుడు రూ.11 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ జెర్సీని అజర్‌ భారత్‌తో జరిగిన 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ధరించాడు. 

Updated Date - 2020-05-09T10:13:11+05:30 IST