రోహిత్‌కన్నా కోహ్లీనే బెస్ట్: ఆస్ట్రేలియా పేసర్
ABN , First Publish Date - 2020-07-18T22:41:46+05:30 IST
ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా యువ పేసర్ జ్యే రిచర్డ్‌సన్ అన్నాడు. హిట్‌మ్యాన్‌గా ...

కాన్‌బెర్రా: ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా యువ పేసర్ జ్యే రిచర్డ్‌సన్ అన్నాడు. హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ కన్నా కోహ్లీ ఆటతీరంటనేనే తనకిష్టమని రిచర్డ్‌సన్ చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిచర్డ్‌సన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను తెలిపాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌లందరిలోనూ కోహ్లీనే గొప్ప బ్యాట్స్‌మన్ అని, కోహ్లీ అందరికన్నా భిన్నంగా ఉంటాడని జ్యే చెప్పాడు. కోహ్లీ ఎనర్జీని అందుకోవడం మరే ఆటగాడికీ సాధ్యం కాదని ప్రశంసించాడు. ‘నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎందరో ఆటగాళ్లను చూశాను. కానీ వారందరికన్నా కోహ్లీ విభిన్నంగా ఉంటాడు. అతని ఆటతీరు ఎంతో గొప్పగా ఉంటుంది. మ్యాచ్ గెలవాలనే తపన కోహ్లీ కొట్టే ప్రతి షాట్‌లో కనిపిస్తుంది. కోహ్లీ ఎనర్జీ లెవెల్స్ కూడా అందరికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని చెప్పడానికి నేను సందేహ పడను’ అంటూ రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే రిచర్డ్‌సన్ ఇండియాపై 13 వన్డే మ్యాచ్‌లు ఆడగా వాటిలో కోహ్లీ వికెట్ 4 సార్లు రిచర్డ్‌సన్‌కే దక్కింది. అంతేకాకుండా 2019లో ఇండియా ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా కోహ్లీని ఏకంగా 3 సార్లు పెవిలియన్‌కు పంపి అందరిని ఆకర్షించాడు. దీంతో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అంటేనే కోహ్లీ, రిచర్డ్‌సన్‌ల పోరులా తయారైంది.