పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత బ్యాట్స్‌మెన్

ABN , First Publish Date - 2020-12-19T16:51:37+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ టెస్టులో రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.

పెవిలియన్‌కు క్యూ కట్టిన భారత బ్యాట్స్‌మెన్

ఆడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఆసీస్ బౌలర్లు కమిన్స్ 4 వికెట్లు, హాజల్ వుడ్ 5 వికెట్లు తీసుకున్నారు. జట్టు స్కోర్ 9/1 దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీ సేన 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి వరకు పర్వాలేదనిపించిన భారతజట్టు.. టీమ్ స్కోర్ 15 పరుగుల దగ్గర బూమ్రా(2), పుజారా(0), మయాంక్ అగర్వాల్(9), రహానే(0) వరుసగా అవుట్ అయ్యారు. 15 పరుగులకు 5 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 26 పరుగుల దగ్గర సాహా(4), అశ్విన్(0) అవుటయ్యారు. విహారీ ప్రయత్నం కూడా విఫలమైంది. 22 బంతుల్లో 8 పరుగులు చేసిన విహారీ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అలా 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. చివర్లో షమి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారతజట్టు ఇన్నింగ్స్ ముగిసింది. జట్టు స్కోర్ 21.2 ఓవర్లకు 36/9. దీంతో ఆసీస్ లక్ష్యం 90 పరుగులు.  

Read more