కెప్టెన్ అవుటయ్యాక.. కాసేపటికే ఆ నలుగురు

ABN , First Publish Date - 2020-12-28T16:55:05+05:30 IST

277/5 ఓవర్ నైట్ స్కోర్ మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 49 పరుగులు మాత్రమే జోడించగలిగింది. రహానే(112), జడేజా(57), శుభ్‌మన్ గిల్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

కెప్టెన్ అవుటయ్యాక.. కాసేపటికే ఆ నలుగురు

మెల్‌బోర్న్: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా 326 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 131 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. సోమవారం ఉదయం 277/5 ఓవర్ నైట్ స్కోర్ మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 49 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కెప్టెన్ రహానే(112), జడేజా(57), శుభ్‌మన్ గిల్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లయన్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ కొట్టగా... పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో రహానే అవుట్ అయ్యాడు. దీంతో ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే మిగిలిన నాలుగు వికెట్లు పడిపోయాయి. జడేజా, ఉమేశ్‌ యాదవ్‌(9), అశ్విన్(14)‌, బుమ్రా(0) పెవిలియన్ చేరారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్, గ్రీన్ చెరో మూడు వికెట్లు, కమిన్స్ రెండు, హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-12-28T16:55:05+05:30 IST