బాక్సింగ్ డే టెస్ట్: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ABN , First Publish Date - 2020-12-26T16:24:48+05:30 IST

భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్కోర్ 155 పరుగుల దగ్గర ఆరో వికెట్ కోల్పోయింది.

బాక్సింగ్ డే టెస్ట్: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

మెల్‌బోర్న్: భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్కోర్ 155 పరుగుల దగ్గర ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కామెరాన్ పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ టిమ్ పైన్(13) కూడా ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో హనుమ విహారీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో కమ్మిన్స్, స్టార్క్ ఉన్నారు.  టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. 

Updated Date - 2020-12-26T16:24:48+05:30 IST