బిల్లింగ్స్‌ సెంచరీ వృథా

ABN , First Publish Date - 2020-09-13T09:05:53+05:30 IST

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. సామ్‌ బిల్లింగ్స్‌ (118) సెంచరీతో...

బిల్లింగ్స్‌ సెంచరీ వృథా

తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ విజయం

మాంచెస్టర్‌: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. సామ్‌ బిల్లింగ్స్‌ (118) సెంచరీతో పోరాడినా మోర్గాన్‌ సేనకు తొలి వన్డేలో ఓటమి తప్పలేదు. శుక్రవారం జరిగిన తొలి డేనైట్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన ఆసీస్‌ 19 పరుగులతో గెలిచింది. తొలుత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (77), మిచెల్‌ మార్ష్‌ (73) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఫించ్‌ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఆర్చర్‌, మార్క్‌వుడ్‌ మూడేసి వికెట్లు తీశారు. రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌లో ఓపెనర్‌ బెయిర్‌స్టో (84) ఒక్కడే రాణించాడు. మిడిలార్డర్‌లో జో రూట్‌ (1), జోస్‌ బట్లర్‌ (1), కెప్టెన్‌ మోర్గాన్‌ (23) కూడా విఫలమయ్యారు. అయితే బిల్లింగ్స్‌ సెంచరీతో పోరాడినా అతనికి లోయరార్డర్‌ మద్దతు లభించలేదు. 

Updated Date - 2020-09-13T09:05:53+05:30 IST