క్వారంటైన్‌లో అశ్విన్ పెళ్లిరోజు.. ఫొటోలు షేర్ చేసిన ప్రీతి
ABN , First Publish Date - 2020-11-14T02:02:24+05:30 IST
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నేడు తన 9వ వివాహ వార్షికోత్సవాన్ని క్వారంటైన్‌లో జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన
సిడ్నీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నేడు తన 9వ వివాహ వార్షికోత్సవాన్ని క్వారంటైన్‌లో జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అశ్విన్ భార్య ప్రీతి నారాయణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. 13 నవంబరు 2011న అశ్విన్, ప్రీతి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంట సిడ్నీలో క్వారంటైన్‌లో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ఆటగాళ్లందరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.
ప్రీతి తన భర్త, ఇద్దరు పిల్లలతో ఉన్న పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ ఫొటోలో ప్రీతి తన భర్త గొంతు పట్టుకుని గట్టిగా పట్టుకోగా, అశ్విన్ పెద్దగా నోరు తెరిచాడు. ‘‘తొమ్మిదేళ్లు అయినందుకు సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి క్వారంటైన్‌లో ఉండడం కంటే రొమాంటిక్ ఇంకేముంటుంది? తప్పించుకునే మార్గం లేదే’’ అని ప్రీతి అశ్విన్ ఈ ఫొటోకు క్యాప్షన్ తగిలించింది. అశ్విన్ కూడా ఇదే ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
ఐపీఎల్‌లో అశ్విన్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ అశ్విన్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ‘‘అశ్విన్, ప్రీతిలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అని అశ్విన్ ఫొటోకు కామెంట్ చేసింది.