అర్జునకు శిఖా, దీప్తి?
ABN , First Publish Date - 2020-05-13T09:49:28+05:30 IST
ఈ ఏడాది అర్జున అవార్డు కోసం మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మ పేర్లను బీసీసీఐ నామినేట్ చేయనున్నట్టు సమాచారం. ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచక్‌పలో...

నామినేట్ చేయనున్న బీసీసీఐ
న్యూఢిల్లీ: ఈ ఏడాది అర్జున అవార్డు కోసం మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మ పేర్లను బీసీసీఐ నామినేట్ చేయనున్నట్టు సమాచారం. ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచక్‌పలో పేసర్ శిఖా పాండే, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుతంగా రాణించారు. ఈ టోర్నీతో పాటు గతేడాది ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ ఇద్దరినీ అర్జునకు సిఫారసు చేయాల్సిందిగా బోర్డు సభ్యులకు బీసీసీఐ ఆపరేషన్స్ క్రికెట్ కమిటీ సూచించినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఫుట్‌బాల్ నుంచి అర్జున అవార్డుకు జాతీయ జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, మహిళల జట్టు స్ట్రయికర్ బాలాదేవి పేర్లను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్) ప్రతిపాదించింది.