ఉమ్మి నిషేధం..బౌలర్లకు కష్టం
ABN , First Publish Date - 2020-12-15T06:06:38+05:30 IST
కరోనాతో క్రికెట్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మైదానం వెలుపల ఆటగాళ్లపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరీస్ కొనసాగినంతకాలం బయోబబుల్‌లో ఉండ డం క్రికెటర్లకు సవాలే...

న్యూఢిల్లీ: కరోనాతో క్రికెట్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మైదానం వెలుపల ఆటగాళ్లపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరీస్ కొనసాగినంతకాలం బయోబబుల్‌లో ఉండ డం క్రికెటర్లకు సవాలే. ఇక.. కరోనా వైరస్ బౌలర్లకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. బంతికి ఉమ్మి పూయడమనే అత్యంత కీలక అంశాన్ని వారి నుంచి దూరం చేసింది. ఇది బౌలర్లకు పెద్ద దెబ్బేనని సచిన్ టెండూల్కర్ కూడా అంగీకరించాడు. ‘ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. కానీ దానికి ప్రత్యామ్నాయం చూపకపోవడం బౌలర్లకు ప్రతిబంధకంగా మారింది. గతంలో ఉమ్మితోపాటు, చెమట రాసేవారు. కానీ ఉమ్మితోనే బంతికి మెరుగు వస్తుంది. ప్రస్తుతం దాన్ని నిషేధించడంతో బ్యాట్స్‌మెన్‌దే రాజ్యమైంది’ అని సచిన్ వివరించాడు.