ఆన్‌లైన్‌లో హాకీ కోచ్‌ల దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-06-18T07:33:48+05:30 IST

కోచ్‌లు, టెక్నికల్‌ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల నమోదు ప్రక్రియకు ఇకనుంచి ఆన్‌లైన్‌ సౌలభ్యం కల్పిస్తున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ)

ఆన్‌లైన్‌లో హాకీ కోచ్‌ల దరఖాస్తులు

న్యూఢిల్లీ: కోచ్‌లు, టెక్నికల్‌ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల నమోదు ప్రక్రియకు ఇకనుంచి ఆన్‌లైన్‌ సౌలభ్యం కల్పిస్తున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) వెల్లడించింది. దేశంలోని హాకీ శాఖల్లో ఎక్కడైనా పనిచేసేందుకు అర్హులైన వారు ఈ కొత్త ఆన్‌లైన్‌ విధానంలో సులువుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని హెచ్‌ఐ అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపారు. హాకీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేశాక.. సంబంధిత రాష్ట్ర శాఖ నుంచి ఆమోదింప చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌ విధానంతో ఎవరైనా ఎక్కడి నుంచైనా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అహ్మద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-18T07:33:48+05:30 IST