తప్పదు మరి.. కోహ్లీ జుట్టు కట్ చేసిన అనుష్క!

ABN , First Publish Date - 2020-03-28T21:08:37+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో టీమిండియా సారథి కోహ్లీ-అనుష్క జంట ఇంటికే పరిమితమైంది. అడుగు

తప్పదు మరి.. కోహ్లీ జుట్టు కట్ చేసిన అనుష్క!

ముంబై: లాక్‌డౌన్ నేపథ్యంలో టీమిండియా సారథి కోహ్లీ-అనుష్క జంట ఇంటికే పరిమితమైంది. అడుగు బయటపెట్టొద్దన్న ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటిస్తూ ఇంటిపట్టునే ఉంటోంది. అంతేకాదు, ఈ విపత్కర సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విరుష్క జంట అభిమానులను కోరింది. మరోవైపు, పెరిగిన జట్టును కట్ చేయించుకునేందుకు బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో కోహ్లీ అలానే ఇంట్లో తిరుగుతున్నాడు. విరాట్‌ను అలా చూడలేకపోయిందో ఏమో.. అనుష్క వంటింట్లోకి వెళ్లి కత్తెర అందుకుంది.  ఎంచక్కా హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోయి కోహ్లీ హెయిర్‌ను సెట్ చేసింది. అచ్చం ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్‌ను గుర్తు చేసింది. ఆ తర్వాత ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు అనుష్క భలే కట్ చేసిందని మెచ్చుకుంటున్నారు. వీడియో షేర్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 25 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

Updated Date - 2020-03-28T21:08:37+05:30 IST