మూడేళ్లయింది.. మరికొద్ది రోజుల్లో ముగ్గురం అవుతాం: అనుష్క ట్వీట్

ABN , First Publish Date - 2020-12-11T20:19:53+05:30 IST

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు మరికొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నారు. వివాహమైన మూడేళ్ల తరువాత తమ మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే శుక్రవారం విరుష్క దంపతుల పెళ్లి రోజు కావడంతో అనుష్క ఓ ఫోటోను షేర్ చేశారు. భర్త కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను ...

మూడేళ్లయింది.. మరికొద్ది రోజుల్లో ముగ్గురం అవుతాం: అనుష్క ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు మరికొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నారు. వివాహమైన మూడేళ్ల తరువాత తమ మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే శుక్రవారం విరుష్క దంపతుల పెళ్లి రోజు కావడంతో అనుష్క ఓ ఫోటోను షేర్ చేశారు. భర్త కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు ఓ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘మనకు పెళ్లయి మూడేళ్లయింది. మరికొన్ని రోజుల్లో ముగ్గురం కాబోతున్నాం. నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా అక్కడే ఉన్న విరాట్ కూడా ఓ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.


పెళ్లి నాటి ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన విరాట్.. ‘మూడేళ్లే కాదు.. జీవితాంతం నీతోనే ఉంటా’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్-అనుష్కలు 2017 డిసెంబరు 11న ఇటలీలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 

Updated Date - 2020-12-11T20:19:53+05:30 IST