క్వార్టర్స్‌లో ఆంధ్ర ప్రత్యర్థి సౌరాష్ట్ర

ABN , First Publish Date - 2020-02-16T09:42:36+05:30 IST

రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆంధ్ర క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ నెల 20 నుంచి ఒంగోలులో జరిగే నాకౌట్‌ సమరంలో సౌరాష్ట్రతో ఆంధ్ర

క్వార్టర్స్‌లో ఆంధ్ర ప్రత్యర్థి సౌరాష్ట్ర

20 నుంచి నాకౌట్‌ మ్యాచ్‌లు

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆంధ్ర క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ నెల 20 నుంచి ఒంగోలులో జరిగే నాకౌట్‌ సమరంలో సౌరాష్ట్రతో ఆంధ్ర తలపడనుంది. శనివారం లీగ్‌ మ్యాచ్‌లు ముగియడంతో నాకౌట్‌ చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. ఎలైట్‌ గ్రూప్‌ ఎ, బి నుంచి టాప్‌-5లో నిలిచిన గుజరాత్‌ (35 పాయింట్లు), బెంగాల్‌ (32), కర్ణాటక (31), సౌరాష్ట్ర (31), ఆంధ్ర (27).. గ్రూప్‌-సి నుంచి ఒడిశా, జమ్ము కశ్మీర్‌, ప్లేట్‌ గ్రూప్‌ నుంచి గోవా క్వార్టర్స్‌ బెర్త్‌లు పట్టేశాయి. రంజీ ట్రోఫీ చరిత్రలో ఆంధ్ర రౌండ్‌-8కు చేరడం ఇది నాలుగోసారి మాత్రమే. 1985-86, 2001-02, 2014-15 సీజన్లలో ఆంధ్ర నాకౌట్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో గోవాతో గుజరాత్‌, ఒడిశాతో బెంగాల్‌, జమ్ము కశ్మీర్‌తో కర్ణాటక తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు కూడా ఈ నెల 20 నుంచే జరుగుతాయి. 


Updated Date - 2020-02-16T09:42:36+05:30 IST