విశాఖకు తరలిన ఏసీఏ కార్యాలయం

ABN , First Publish Date - 2020-12-11T09:18:21+05:30 IST

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రధా న పరిపాలన కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నంకు మార్చారు. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు...

విశాఖకు తరలిన ఏసీఏ కార్యాలయం

విశాఖపట్నం (స్పోర్ట్సు): ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రధాన పరిపాలన కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నంకు మార్చారు. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ క్రికెట్‌ సంఘాల ప్రధాన కార్యాలయాలన్నీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లోనే ఉన్నందున ఏసీఏ కార్యాలయాన్ని కూడా విశాఖ మైదానానికి మార్చినట్టు చెప్పారు. ఆంధ్రకు కేటాయించే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సమన్వయ లోపం తలెత్తకుండా ఉండేందుకు కార్పొరేట్‌ పరిపాలన కేం ద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. దీని వెనుక రాజకీయ దుర్దేశాలు లేవని శరత్‌ స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం మాజీ పేసర్‌ విజయ్‌కుమార్‌కు రూ.5 లక్షల చెక్‌ను శరత్‌, బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చేతుల మీదుగా అందజేశారు.

Updated Date - 2020-12-11T09:18:21+05:30 IST