ఆనంద్‌...అదే తీరు

ABN , First Publish Date - 2020-07-27T08:58:32+05:30 IST

‘లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌’ ఆన్‌లైన్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో రౌండ్‌లోనూ విషీకి ఓటమి ఎదురైంది. ఐదో

ఆనంద్‌...అదే తీరు

  • లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌

చెన్నై: ‘లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌’ ఆన్‌లైన్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో రౌండ్‌లోనూ విషీకి ఓటమి ఎదురైంది. ఐదో రౌండ్‌లో హంగేరి గ్రాండ్‌ మాస్టర్‌ పీటర్‌ లెకో చేతిలో విషీ 2-3తో పరాజయం పాలయ్యాడు. బెస్ట్‌ ఆఫ్‌ ఫోర్‌లో ఆనంద్‌.. తొలి గేమ్‌ను గెలిచి మెరుగ్గా ఆరంభించాడు. ఆ తర్వాతి రెండు గేమ్‌లను డ్రాగా ముగించినా.. చివరి రెండు గేముల్లో ఓడాడు. 

Updated Date - 2020-07-27T08:58:32+05:30 IST