ఆయన త్వరలోనే వస్తారు!

ABN , First Publish Date - 2020-05-09T10:08:16+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా జర్మనీలో చిక్కుకుపోయిన భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ త్వరలోనే స్వదేశానికి చేరుకుంటారని అతని భార్య అరుణ...

ఆయన త్వరలోనే వస్తారు!

జర్మనీలోనే ఆనంద్‌ 

 అధికారులతో మాట్లాడామన్న భార్య అరుణ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా జర్మనీలో చిక్కుకుపోయిన భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ త్వరలోనే స్వదేశానికి చేరుకుంటారని అతని భార్య అరుణ తెలిపింది. ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఆనంద్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారనీ.. విమానాల రాకపోకలు మొదలైన వెంటనే తిరిగొస్తారని ఆమె పేర్కొంది. బుండెస్‌లిగా చెస్‌ టోర్నీలో ఆడేందుకు జర్మనీ వెళ్లిన ఆనంద్‌.. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయాడు. లాక్‌డౌన్‌తో అక్కడే ఉన్నప్పటికీ ఆనంద్‌.. ఆన్‌లైన్‌ ద్వారా చెస్‌ టోర్నీల్లో పాల్గొంటూ నిధులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేషన్స్‌ కప్‌ ఆన్‌లైన్‌ చెస్‌ ఆడుతున్నాడు.

Updated Date - 2020-05-09T10:08:16+05:30 IST