వాంఖడేలో ధోనీ పేరున పర్మినెంట్ సీట్!

ABN , First Publish Date - 2020-08-19T01:02:09+05:30 IST

వాంఖడే స్టేడియంలో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును ఓ సీట్ కు పెట్టనున్నారు . 2011 ప్రపంచ కప్ లో ధోనీ తన హెలికాప్టర్ సిక్స్ తో భారత్ కు...

వాంఖడేలో ధోనీ పేరున పర్మినెంట్ సీట్!

ముంబై: వాంఖడే స్టేడియంలో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును ఓ సీట్ కు పెట్టనున్నారు. 2011 ప్రపంచకప్ లో ధోనీ తన హెలికాప్టర్ సిక్స్ తో భారత్ కు విజయాన్నందించిన విషయం తెలిసిందే. అతడు కొట్టిన సిక్స్ స్టాండ్స్ లో ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ ఉన్న సీట్ కు ధోనీ పెరు పెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్ ప్రతిపాదించారు. 'ఆ సీట్ కు కొత్తగా పెయింట్ వేసి చక్కగా అలంకరిస్తాం. వాంఖడే స్టేడియంతో ధోనీకి గల అనుబంధాన్ని తెలిపేలా ఇది ఉంటుంద'ని ఆజింక్య నాయక్ తెలిపారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వాంఖడేలో ధోనీ పేరున ఓ సీట్ ఏర్పాటు చేయడం అతడికి ఓ గొప్ప బహుమతిగా చెప్పవచ్చు.

Updated Date - 2020-08-19T01:02:09+05:30 IST