తండ్రయిన అంబటి రాయుడు

ABN , First Publish Date - 2020-07-14T09:02:59+05:30 IST

భారత క్రికెటర్‌ అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆదివారం అతడి భార్య విద్య కూతురికి జన్మనిచ్చింది...

తండ్రయిన అంబటి రాయుడు

హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆదివారం అతడి భార్య విద్య కూతురికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మొదట చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘డాడీస్‌ ఆర్మీ నుంచి మైదానం బయట నేర్చుకున్న విషయాలను ఇక ఇప్పుడు ఉపయోగించాల్సిందే’ అని సరదాగా ట్వీట్‌ చేసింది. కాగా, సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా నెట్టింట్లో అంబటి రాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-07-14T09:02:59+05:30 IST