బెన్‌ స్టోక్స్‌ వచ్చేస్తున్నాడు

ABN , First Publish Date - 2020-10-04T09:13:59+05:30 IST

వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభవార్త. స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌లో ఆడడం...

బెన్‌ స్టోక్స్‌ వచ్చేస్తున్నాడు

దుబాయ్‌: వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభవార్త. స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌లో ఆడడం ఖాయమైంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ నుంచి బయలుదేరిన అతను ఆదివారం యూఏఈలో అడుగుపెట్టనున్నాడు. అయితే వెంటనే రాజస్థాన్‌ జట్టులో చేరడం కాకుండా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటాడు. ఈనెల 14న ఢిల్లీతో మ్యాచ్‌లో స్టోక్స్‌ ఆడే అవకాశం ఉంది. తండ్రి అనారోగ్యం రీత్యా కొంతకాలం క్రితమే అతడు కివీస్‌కు వెళ్లాడు.

Updated Date - 2020-10-04T09:13:59+05:30 IST