గోల్ మానిటరింగ్ కోసం ప్రాఫిట్ డాట్ కోతో ఏఐఎఫ్‌ఎఫ్ భాగస్వామ్యం
ABN , First Publish Date - 2020-12-15T05:38:33+05:30 IST
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) గతేడాది రెండో దఫా ప్రారంభించిన నాలుగేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను పర్యవేక్షించేందుకు...
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) గతేడాది రెండో దఫా ప్రారంభించిన నాలుగేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను పర్యవేక్షించేందుకు ప్రాఫిట్‌డాట్‌కోకి చెందిన ఓకేఆర్ సాఫ్ట్‌వేర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇకపై ఏఐఎఫ్ఎఫ్ ప్రణాళిక, దాని అభివృద్ధి, విజయాలకు సంబంధించిన అంశాలను ఓకేఆర్ స్ట్రాటజీ టూల్ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది మార్చి 2020లో తమ సిబ్బందిని ఫీల్డ్ నుంచి స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చి వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేసేందుకు ఏఐఎఫ్ఎఫ్ తొలిసారి ప్రాఫిట్.కో ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసింది. ‘‘పారదర్శకత, ప్రత్యేకించి సహకార ఒప్పందాల సమయంలో సాయపడేలా ఉన్నందునే ఓకేఆర్‌ను ఎంచుకున్నాం. ఆయా విభాగాల మధ్య చర్చలు, సంబంధాలతో పాటు వేగంగా, మరింత సమర్థవంతంగా పనులు జరిగేందుకు ఓకేఆర్ ఉపకరించగలదు. మాకు ఓ ప్రభావవంతమైన పర్యవేక్షణ, ట్రాకింగ్ టూల్ అవసరం. క్రమమైన టీమ్ స్ఫూర్తిని కూడా అందిస్తుండడంతో ఓకేఆర్‌తో జట్టుకట్టాం..’’ అని ఏఐఎఫ్ఎఫ్ జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పలు డిజిటల్ కార్యక్రమాలు, ఆవిష్కరణలను అమలు చేసేందుకు, ప్రారంభించేందుకు ఓకేఆర్ సాఫ్ట్‌వేర్ ఉపకరించిందని కూడా దాస్ పేర్కొన్నారు. ‘‘2020 మేలో మేము ఏఐఎఫ్ఎఫ్ టీవీ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పలు డిజిటల్ టూల్స్, ప్రాజెక్టులను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. సాయ్ భాగస్వామ్యంలో ప్రారంభించిన ఈ-పాఠశాల ఇలాంటిదే. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అక్టోబర్ రెండో వారంలో కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి బయో-బబుల్‌లో మైదానంలో క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించిన తొలి స్పోర్ట్స్ ఫెడరేషన్ కూడా ఏఐఎఫ్ఎఫే..’’ అని దాస్ గుర్తుచేశారు.