అరోన్ ఫించ్ ఖాతాలో అరుదైన రికార్డు
ABN , First Publish Date - 2020-11-27T23:53:47+05:30 IST
భారత్‌తో ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ స్కిప్పర్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత

సిడ్నీ: భారత్‌తో ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ స్కిప్పర్ అరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు సాధించిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. ఫించ్ 126 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఇటీవల కన్నుమూసిన డీన్ జోన్స్ 128 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, ఫించ్ రెండు ఇన్నింగ్స్‌ల ముందే ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. 115 ఇన్నింగ్స్‌లలోనే 5 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ముందున్నాడు. ఇక, ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా 101 ఇన్నింగ్స్‌లలోనే 5 పరుగులు సాధించి జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.