ఇంగ్లండ్‌ పర్యటనకు బ్రావో, కీమో పాల్‌, హెట్‌మయర్‌ నో

ABN , First Publish Date - 2020-06-04T09:14:41+05:30 IST

వచ్చేనెల 8 నుంచి జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు డారెన్...

ఇంగ్లండ్‌ పర్యటనకు బ్రావో, కీమో పాల్‌, హెట్‌మయర్‌ నో

సెయింట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా): వచ్చేనెల 8 నుంచి జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు డారెన్‌ బ్రావో, షిమ్రన్‌ హెట్‌మయర్‌, కీమో పాల్‌ అయిష్టత వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఈ సిరీస్‌ మొత్తం బయో సెక్యూర్‌ వాతావరణంలో జరగనుంది. అయితే, ఈ ముగ్గురూ ఎందుకు నిరాకరించారనేది స్పష్టం చేయలేదు. ఈ సిరీస్‌ కోసం విండీస్‌ బోర్డు 14 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముందు జాగ్రత్తగా రిజర్వు ప్లేయర్లను టీమ్‌తోపాటు పంపనుంది. కరోనా పరీక్షల అనంతరం ఈనెల 8న వెస్టిండీస్‌ టీమ్‌ ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. 

Updated Date - 2020-06-04T09:14:41+05:30 IST