ఐపీఎల్‌కు అదనంగా 3 కోట్ల వీక్షకులు

ABN , First Publish Date - 2020-11-21T10:15:38+05:30 IST

యూఏఈలో జరిగిన ఈ సీజన్‌ ఐపీఎల్‌కు టీవీ వీక్షకులు ఏకంగా 23 శాతం పెరిగినట్టు స్టార్‌ ఇండియా ప్రకటించింది.

ఐపీఎల్‌కు అదనంగా 3 కోట్ల వీక్షకులు

ముంబై: యూఏఈలో జరిగిన ఈ సీజన్‌ ఐపీఎల్‌కు టీవీ వీక్షకులు ఏకంగా 23 శాతం పెరిగినట్టు స్టార్‌ ఇండియా ప్రకటించింది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) నివేదిక ప్రకారం 2020 ఐపీఎల్‌కు ఐదు ప్రాంతీయ (తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, బెంగాళీ) భాషల్లో అదనంగా 3 కోట్ల 15 లక్షల వ్యూస్‌ లభించినట్టు స్టార్‌ ఇండియా తెలిపింది. ఓవరాల్‌గా 40.5 కోట్ల మంది ఐపీఎల్‌ను వీక్షించారు. 

Read more