అగ్ర‌రాజ్యంలో ద‌య‌నీయం.. జూమ్‌ యాప్‌తో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-04-14T14:38:01+05:30 IST

ఇటీవలి కాలంలో జూమ్‌ యాప్‌ బాగా ప్రాచుర్యం పొందింది. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ఆఫీసు విధులకు హాజరుకాలేనివారు కాన్ఫరెన్స్‌లు పెట్టుకోవడానికి స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడానికి ఈ యాప్‌ను బాగా వాడుతున్నారు.

అగ్ర‌రాజ్యంలో ద‌య‌నీయం.. జూమ్‌ యాప్‌తో అంత్యక్రియలు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఏప్రిల్‌ 13: ఇటీవలి కాలంలో జూమ్‌ యాప్‌ బాగా ప్రాచుర్యం పొందింది. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ఆఫీసు విధులకు హాజరుకాలేనివారు కాన్ఫరెన్స్‌లు పెట్టుకోవడానికి స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడానికి ఈ యాప్‌ను బాగా వాడుతున్నారు. కరోనాతో విలవిల్లాడుతూ వేలసంఖ్యలో మరణాలను నమోదు చేస్తున్న అమెరికాలో అంత్యక్రియల నిర్వహణకు కూడా ఈ యాప్‌ను వాడుకోవాల్సి రావడం అత్యంత విషాదకరం.


మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, మిత్రులను మార్చురీలకు అనుమతించడం లేదు. దీనివల్ల తమ ఆప్తులను చివరిసారి చూడాలన్న కోరిక కూడా నెరవేరడం లేదు. ఈ పరిస్థితుల్లో జూమ్‌ యాప్‌ ద్వారా అంత్యక్రియలను, స్మారక సేవలను లైవ్‌లో చూస్తున్నారు. అమెరికాలోని కొన్ని మార్చురీలు ఇలాంటి వర్చ్యువల్‌ అంత్యక్రియలు, స్మారక  సేవలను అందిస్తున్నాయి. వాటిని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో ఇతరులకు షేర్‌ చేస్తున్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా 500 మంది వరకు ఆన్‌లైన్‌లో వీటిని చూసే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-04-14T14:38:01+05:30 IST