యువతి ప్రాణాలు తీసిన మొబైల్..!

ABN , First Publish Date - 2020-12-13T21:59:40+05:30 IST

బాత్‌రూంలో చార్జింగ్ పెట్టిన మొబైల్ బాత్‌టబ్‌లో పడటంతో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో

యువతి ప్రాణాలు తీసిన మొబైల్..!

మాస్కో: బాత్‌రూంలో చార్జింగ్ పెట్టిన మొబైల్ బాత్‌టబ్‌లో పడటంతో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 24ఏళ్ల ఒలేసియా రష్యాలోని అర్ఖంగెల్స్క్‌ నగరంలో నివసిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఆమె తన మొబైల్‌ను బాత్‌రూంలో చార్జింగ్‌ పెట్టి బాత్‌టబ్‌లో స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా మొబైల్ టబ్‌లో పడిపోయింది. దీంతో విద్యుదాఘాదానికి గురై.. ఒలేసియా ప్రాణాలు విడిచింది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఒలేసియా కరెంట్ షాక్ వల్లే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఆ దేశ ఎమర్జెన్సీస్ మినిస్ట్రీ స్పందించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆగస్ట్‌లో 15 ఏళ్ల బాలిక కూడా ఇదే విధంగా బాత్‌రూంలో విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. 2019లో 26ఏళ్ల మహిళ కూడా కరెంట్‌ షాక్‌తో బాత్‌రూంలో చనిపోయింది. 


Updated Date - 2020-12-13T21:59:40+05:30 IST