ప్రస్తుతం ఆ సవాల్‌ను పరిష్కారించాల్సి ఉంది: బయోఎన్‌టెక్ సీఈఓ
ABN , First Publish Date - 2020-12-13T07:49:22+05:30 IST
ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన వ్యాక్సిన్‌కు అమెరికా రెగ్యులేటర్ ఎఫ్‌డీఏ అప్రూవల్ లభించింది.

వాషింగ్టన్: ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన వ్యాక్సిన్‌కు అమెరికా రెగ్యులేటర్ ఎఫ్‌డీఏ అప్రూవల్ లభించింది. వ్యాక్సిన్‌ను 16 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వవచ్చంటూ అనుమతులను జారీ చేశారు. ఎఫ్‌డీఏ తమ వ్యాక్సిన్‌ను అప్రూవ్ చేయడం తమకు ఓ మైలురాయి అంటూ బయోఎన్‌టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌కు అప్రూవల్ రావడంతో ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ సవాల్‌ను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డోస్‌లను ఎలా తయారుచేయాలన్న దానిపైనే ప్రస్తుతం తాము దృష్టి సారించినట్టు ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఇదే నెలలో కనీసం నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అటు అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్ల ప్రాణాలను కాపాడాలంటే వెంటనే కోట్లాది మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.