గడిచిన మూడు నెలల్లో మొట్టమొదటిసారిగా.. రష్యాలో..

ABN , First Publish Date - 2020-07-21T04:11:22+05:30 IST

రష్యాలో గడిచిన 24 గంటల్లో 5,940 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది.

గడిచిన మూడు నెలల్లో మొట్టమొదటిసారిగా.. రష్యాలో..

మాస్కో: రష్యాలో గడిచిన 24 గంటల్లో 5,940 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 7,77,486కు చేరింది. ఏప్రిల్ 29 నుంచి ఇప్పటివరకు చూస్తే.. రష్యాలో 6 వేల కంటే తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 29న రష్యాలో 5,841 కరోనా కేసులు నమోదుకాగా.. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా 6 వేలకు తగ్గకుండా కేసులు వస్తున్నాయి. కొత్తగా నమోదైన కేసులు మొత్తం 85 ప్రాంతాల నుంచి బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. కొత్తగా నమోదైన మొత్తం కేసుల్లో 1,556 మందికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిపింది. రాజధాని మాస్కోలో అత్యధికంగా 578 కేసులు నమోదైనట్టు రెస్పాన్స్ సెంటర్ చెప్పింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యాలో 85 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం ఈ సంఖ్య 95గా ఉంది. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 12,427కు చేరింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలున్నాయి. అమెరికా దేశం కేసుల విషయంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది.  

Updated Date - 2020-07-21T04:11:22+05:30 IST