అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు ట్రంప్‌లో లేవు: హిల్లరీ క్లింటన్

ABN , First Publish Date - 2020-08-20T22:07:16+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, 2016 డెమొక్రటిక్

అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు ట్రంప్‌లో లేవు: హిల్లరీ క్లింటన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, 2016 డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు కావాల్సిన లక్షణాలు ట్రంప్‌లో లేవని ఆమె అన్నారు. ట్రంప్ నాయకత్వంలో అంచులకు పోయిన దేశాన్ని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌‌లు మాత్రమే తిరిగి గాడిలో పెట్టగలరని ఆమె ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు అత్యధిక ఓట్లు పడాలని.. గత ఎన్నికల ఫలితాలు మరోమారు పునరావృతం కాకూడదని హిల్లరీ అన్నారు. గత ఎన్నికల్లో తనకు ట్రంప్ కంటే 30 లక్షల ఓట్లు అత్యధికంగా వచ్చినప్పటికి అధ్యక్ష పీఠం చేజారిందని.. జో బైడెన్ విషయంలో కూడా ఇలానే జరిగే అవకాశం ఉండొచ్చన్నారు. కాబట్టి ప్రజలు జో బైడెన్‌కు అత్యధికంగా ఓట్లు వేయాలని హిల్లరీ కోరారు. ట్రంప్ ఎంత ప్రమాదకరమో ఆయన గెలిచే వరకు తాము గ్రహించలేకపోయామని గడిచిన నాలుగేళ్లలో తనతో ఎంతో మంది చెప్పినట్టు హిల్లరి తెలిపారు. ట్రంప్ మంచి అధ్యక్షుడిగా పరిపాలన అందిస్తారని తాను మొదట భావించానని.. కానీ ట్రంప్ అలా చేయలేదని హిల్లరీ అన్నారు. కాగా.. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు మొత్తం నాలుగు రోజుల పాటు సాగనుంది. ఇప్పటికే మూడు రోజులు పూర్తికాగా.. చివరి సదస్సు గురువారం జరగనుంది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు ఆగస్టు 21 నుంచి 24 వరకు జరగనుంది. ఇక అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

Updated Date - 2020-08-20T22:07:16+05:30 IST