కొత్త స్ట్రెయిన్‌తో యువతకు ముప్పే: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-12-27T13:28:55+05:30 IST

కొత్త స్ట్రెయిన్‌ కరోనా యువతకు, పిల్లలకూ ప్రమాదకరమేనని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కొత్త స్ట్రెయిన్‌.. ఏస్‌2 గ్రాహకాలను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు సులభంగా సోకుతోంది. ఐదారు వారాలుగా యూకేలో నమోదవుతున్న కేసుల్లో 15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయం ఉండటమే దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

కొత్త స్ట్రెయిన్‌తో యువతకు ముప్పే: డబ్ల్యూహెచ్ఓ

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఇప్పటికే పిల్లలకు ప్రమాదమని ఖరారు

8 ఐరోపా దేశాలకు పాకిన న్యూ స్ట్రెయిన్‌

జపాన్‌లో 60 ఏళ్ల వృద్ధుడిలో గుర్తింపు

లండన్‌, డిసెంబరు 26: కొత్త స్ట్రెయిన్‌ కరోనా యువతకు, పిల్లలకూ ప్రమాదకరమేనని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కొత్త స్ట్రెయిన్‌.. ఏస్‌2 గ్రాహకాలను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు సులభంగా సోకుతోంది. ఐదారు వారాలుగా యూకేలో నమోదవుతున్న కేసుల్లో 15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయం ఉండటమే దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కొత్త స్ట్రెయిన్‌.. పిల్లలపై ప్రత్యేకంగా దాడి చేస్తుందని తాము చెప్పడం లేదని బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య నిపుణురాలు వెండీ బార్ల్కే ఇటీవల వెల్లడించారు. కాగా, కొత్త స్ట్రెయిన్‌ యూర్‌పలోని మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటికి 8 దేశాలకు పాకింది. తాజాగా స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఇలాంటి నాలుగు కేసులను గుర్తించారు.  మరో వైపు బ్రిటన్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చినవారిలో కరోనా నిర్ధారణ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం నాటికి 50 మందికి పైనే పాజిటివ్‌ వచ్చింది. కర్ణాటకలో 14 మందికి, ఢిల్లీ, కేరళలో 8 మంది చొప్పున, తమిళనాడులో నలుగురిలో వైరస్‌ లక్షణాలు కన్పించాయి. 


జూన్‌ 2 తర్వాత 300 దిగువకు మరణాలు

దేశంలో కరోనా మరణాలు గణనీయంగా తగ్గాయి. వైర్‌సతో శుక్రవారం 251 మంది మృతి చెందారు. జూన్‌ 2 తర్వాత ఇవే అతి తక్కువ. కొత్తగా 22,273 కేసులు నమోదయ్యాయి. 22,274 మంది కోలుకున్నారు. కాగా, దేశంలో అనుసరిస్తున్న కరోనా చికిత్సా విధానాలు/పద్ధతులు ఒక్క పాజిటివ్‌ కూడా నమోదు కాకుండా పోలేనంత సమగ్రంగా ఉన్నాయని.. కొవిడ్‌-19పై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ అభిప్రాయపడింది. 


మోడెర్నా టీకాతో వైద్యుడికి తీవ్ర అలర్జీ

మోడెర్నా టీకా వేయించుకున్న ఓ అమెరికా వైద్యుడిలో దుష్ప్రభావాన్ని గుర్తించారు. మోడెర్నా కంపెనీ టీకాతో అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత వెలుగుచూసిన తీవ్ర ఇన్ఫెక్షన్‌ ఇదే. అమెరికన్‌ మీడియా ప్రకారం.. బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌లోని జెరియాట్రిక్‌ ఆంకాలజీ విభాగంలో ఫెల్లోగా సేవలందిస్తున్న వైద్యుడు హోసేన్‌కు వ్యాక్సిన్‌ను వేయించుకోగానే.. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు మైకం కమ్మేసి తల తిరిగినట్లు అయింది.

Updated Date - 2020-12-27T13:28:55+05:30 IST